: కేరళలో ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా!


దేశంలోని ప్రతి ఒక్కరికీ బ్యాంక్ ఖాతాను అందించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం 'ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన'ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి అటు ప్రజల నుంచి ఇటు బ్యాంకర్ల నుంచి విశేష స్పందన లభించింది. అయితే కేరళలో మాత్రం ఇప్పటికే ప్రతి కుటుంబం ఓ బ్యాంకు ఖాతాను కలిగి ఉందట. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్వయంగా వెల్లడించింది. అక్షరాస్యతలో వంద శాతం పలితాలు సాధించి ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలిచిన కేరళ తాజాగా బ్యాంకు ఖాతాల విషయంలోను ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన స్థానంలో నిలవడం విశేషం.

  • Loading...

More Telugu News