: సబ్ కమిటీ భేటీ టెంట్లు పీకేందుకు రైతుల యత్నం...రాయపూడిలో ఉద్రిక్తత
నవ్యాంధ్ర కొత్త రాజధాని భూముల సేకరణ విషయంలో మంత్రుల సబ్ కమిటీ సమావేశం టెంట్లు పీకేందుకు తుళ్లూరు మండలం రాయపూడి రైతులు యత్నించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధాని కోసం భూములిచ్చేది లేదంటూ తెగేసి చెప్పిన రైతులు సబ్ కమిటీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, రైతుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. సబ్ కమిటీ సమావేశానికి నిరసనగా రైతులు విజయవాడ రహదారిపై ధర్నా నిర్వహించారు. సాయంత్రం మొదలైన ఉద్రిక్త పరిస్థితులు రాత్రి దాకా కొనసాగుతూనే ఉన్నాయి. రైతుల నిరసనలను లెక్కచేయని సబ్ కమిటీ సమావేశాన్ని కొనసాగిస్తోంది.