: లోకేశ్ పై కేసు నమోదు చేయండి: ఎల్బీనగర్ పీఎస్ లో టీఆర్ఎస్ నేత ఫిర్యాదు


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ పై కేసు నమోదు చేయాలని టీఆర్ఎస్ శనివారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తెలంగాణ సర్కారుతో పాటు సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేశ్ పై కేసు నమోదు చేయాలని టీఆర్ఎస్ నేత రామనర్సింహ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్ఎస్ గూండాలు రేవంత్ రెడ్డిపై దాడులు చేస్తున్నారంటూ ఇటీవల ట్విట్టర్ లో లోకేశ్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని రౌడీలు నడుపుతున్నారని, కేసీఆర్ హిట్లర్ లా పాలన సాగిస్తున్నారని సదరు ట్విట్టర్ పోస్టుల్లో లోకేశ్ ఆరోపించారు. తన తండ్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ప్రమోట్ చేయడంతో బిజీబిజీగా ఉంటే, కేసీఆర్ అండ్ కో మాత్రం విద్వేషాలను ప్రమోట్ చేస్తున్నారని కూడా లోకేశ్ సదరు పోస్టుల్లో ఆరోపించారు.

  • Loading...

More Telugu News