: మెట్రో రైలుపై కేసీఆర్ సమీక్ష... ట్రయల్ రన్ పై చర్చ!
తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు శనివారం సాయంత్రం హైదరాబాద్ మెట్రో రైలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు ఎల్ అండ్ టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నాయక్, మెట్రో రైలు ఎండీ ఏవీఎస్ రెడ్డి, పలు శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇటీవలి మెట్రో రైల్ ట్రయల్ రన్ వాయిదా పడ్డ అంశంపై ఈ సమీక్షలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ట్రయల్ రన్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత విద్యుత్ సరఫరాలో నెలకొన్న అంతరాయం వల్ల ట్రయల్ రన్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని ఎల్ అండ్ టీ కోరుతోంది. ట్రయల్ రన్ సోమవారంలోగా జరగకపోతే చాలా కాలం పాటు దానిని వాయిదా వేయాల్సి వస్తుందని ఆ సంస్థ వాదిస్తోంది.