: రాజధాని భూముల అప్పగింతకు వ్యతిరేకంగా రైతుల సంతకాలు


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సర్కారుకు తుళ్లూరు పరిసర రైతులు శనివారం షాకిచ్చారు. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను ఇవ్వబోమని వారు తేల్చి చెప్పారు. ఇందుకనుగుణంగా తమ వాదనను ప్రభుత్వానికి వినిపించేందుకు భూముల అప్పగింతకు వ్యతిరేకంగా సంతకాల సేకరణలో నిమగ్నమయ్యారు. 150 రకాల పంటలు పండే తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇచ్చే పరిస్థితే లేదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాజధానికి కూరగాయలు సరఫరా చేయడానికి తాము సిద్ధమని, భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు మాత్రం సిద్ధంగా లేమని ప్రకటించారు.

  • Loading...

More Telugu News