: 'కుటుంబ నియంత్రణ' బాధితులకు రాహుల్ పరామర్శ
ఛత్తీస్ గడ్ లోని బిలాస్ పూర్ లో ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ లు చేయించుకుని మరణించిన మహిళా కుటుంబాల బాధితులను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనకు ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అయితే, ప్రభుత్వం తన తప్పును ఒప్పుకోవడంలేదన్నారు. "ఈ ఘటనలో కేవలం నిర్లక్ష్యమే కాదు, అవినీతి ప్రమేయం కూడా ఉంది. వాస్తవాలను దాచి ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మొత్తం బాధ్యత ఛత్తీస్ గడ్ ప్రభుత్వానిదే" అని రాహుల్ పేర్కొన్నారు. నాలుగు రోజుల కిందట జరిగిన కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల్లో 14 మంది మహిళలు చనిపోయారు.