: కొన్ని ఫేస్ బుక్ యాడ్ లు నకిలీ వస్తువులు అమ్ముతున్నాయట!


ఫేస్ బుక్ లో వచ్చే కొన్ని ప్రకటనలు ప్రమోట్ చేస్తున్న ఫ్యాషన్, విలాసవస్తువులు నకిలీ కావొచ్చని ఓ కొత్త పరిశోధనలో తేలింది. ఇద్దరు సైబర్ భద్రతా పరిశోధకుల విశ్లేషణ ప్రకారం, వెయ్యి ఫేస్ బుక్ ప్రకటనల్లో దాదాపు పావువంతు నకిలీ వస్తువులేనని తేలిందట. ఈ క్రమంలో 180 ప్రకటనల ఫ్యాషన్, విలాస వస్తువులను పరిశీలించగా, వాటిలో 43 నకిలీ వస్తువులను వెబ్ సైట్ లు అమ్ముతున్నట్టు కనుగొన్నారట. తాము పరిశోధన మొదలుపెట్టిన సమయంలో కొన్ని నకిలీ ప్రకటనలు తొలగించినట్టు పరిశోధకులు ఆండ్రియా స్ట్రాప్పా, అగోస్టినోలు తెలిపారు. ఈ పరిశోధనపై స్పందించిన ఫేస్ బుక్ అధికార ప్రతినిధి ఒకరు, "మోసగించే లేదా తప్పుదోవ పట్టించే, కంటెంట్ ను మేము నిషేధించాం. మా నిబంధనలు, విధానాలను అమలు చేస్తాము. సరైన ప్రకటనలే ఉండేందుకు మరింత దృష్టి పెడతాం" అని చెప్పారు.

  • Loading...

More Telugu News