: ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు: సుజనా చౌదరి
ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. కేంద్ర మంత్రిగా ఎన్నికైన తరువాత తొలిసారి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లిన సందర్భంగా తిరుమలలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి చేయాల్సినదంతా చేస్తానని అన్నారు. సంస్థల విస్తరణలో బ్యాంకుల సహకారం ప్రతి పారిశ్రామిక వేత్త తీసుకునేదేనని ఆయన అభిప్రాయపడ్డారు. తనపై వ్యక్తిగత ఆరోపణలు లేవని ఆయన స్పష్టం చేశారు.