: మార్కుల షీటునే కాదు, అనుభవ పత్రాలనూ ఫోర్జరీ చేశారు... కేంద్ర మంత్రిపై మరో కేసు
కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి కతేరియాపై మరో కేసు నమోదైంది. రెండు యూనివర్సిటిలకు చెందిన మార్కుల షీట్లతోపాటు ఉద్యోగం పొందే సమయంలో వర్క్ ఎక్స్ పీరియన్స్ విషయంలోనూ ఫోర్జరీ పత్రాలను సమర్పించారని కేసు నమోదైంది. తనపై వచ్చిన ఆరోపణలు రుజువైతే మంత్రి పదవికి, ఎంపి పదవికి రాజీనామా చేస్తానని కతేరియా శనివారం అన్నారు. పోలీసులు ఆయనపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసారు. కోర్ట్ లో కేసు రుజువైతే 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు ఎన్నికల్లో పాల్గొనే అర్హతను ఆయన కోల్పోతారు.