: నా జీవితం సినిమాగా వద్దు: సానియా మీర్జా


తన జీవితం ఆధారంగా సినిమా రూపొందడం ఇష్టం లేదని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, తాను పెద్దగా కలివిడి మనిషిని కాదని అన్నారు. తన జీవితంలో చోటు చేసుకున్న ముఖ్య ఘటనలను బహిర్గతం చేయాలని తాను భావించడం లేదని సానియా పేర్కొంది. కాదు కూడదు అని సినిమా తీస్తే మాత్రం దీపికా పదుకునే తన పాత్ర పోషిస్తే సంతోషమని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనలు పదిమందికి చెప్పడం అవసరమా? అని భావించే ఓ సినీ దర్శకుడి ఆఫర్ ను తిరస్కరించానని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News