: ఏపీలో కాంగ్రెస్ చచ్చిపోయింది... రెండు రాష్ట్రాలలోనూ సమైక్య ఉద్యమం వస్తుంది: జేసీ దివాకర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత గీతారెడ్డితో మాట్లాడుతూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ విభజనపై భ్రమలు తొలగిపోయాయని అన్నారు. ప్రజలకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు అర్థమవుతున్నాయని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే రెండు రాష్ట్రాల్లోనూ సమైక్య ఉద్యమం వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.