: రేవంత్ ఇంటి ఎదుట జాగృతి కార్యకర్తల ఆందోళన


టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఇంటి ఎదుట తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో, 10 మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాగృతి అధ్యక్షురాలు కవిత సమగ్ర సర్వేలో హైదరాబాద్, నిజామాబాద్ లలో వివరాలు నమోదు చేయించుకున్నారని రేవంత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. రేవంత్ వ్యాఖ్యలు అసెంబ్లీలో వేడి పుట్టించాయి. విదేశాల నుంచి ఈ రోజే తిరిగి వచ్చిన కవిత కూడా రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు.

  • Loading...

More Telugu News