: తగ్గుతున్న నిత్యావసరాల ధరలు... అక్టోబర్లో 1.77 శాతానికి ద్రవ్యోల్బణం
టోకు ధరల సూచిక ఆధారిత ద్రవ్యోల్బణం గడచిన అక్టోబర్ నెలలో 1.77 శాతంగా నమోదైంది. 2009 తరువాత ద్రవ్యోల్బణం ఇంత తక్కువ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. దేశంలో కూరగాయలు సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని గణాంకాల శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. గత మే నెల నుంచి ఆహార ద్రవ్యోల్బణం సైతం తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే.