: ఆకతాయిల ఆటకట్టించిన కర్నూలు యువతి


నిత్యం వేధింపులకు దిగుతున్న ఇద్దరు ఆకతాయిలకు బుద్ధి చెప్పింది కర్నూలు యువతి. కనిపించిన ప్రతిసారి తనను వేధిస్తున్నా, ఆ బాధను పంటి బిగువున భరిస్తూ వస్తున్న ఆ యువతి శుక్రవారం మాత్రం అపర కాళికే అయింది. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ యువతిని ఎప్పటిలాగే ఆ ఇద్దరు ఆకతాయిలు వేధించడం ప్రారంభించారు. దీంతో ఒక్కసారిగా ధైర్యం కూడదీసుకున్న ఆ యువతి, ఆ ఇద్దరు ఆకతాయిల చెంపలను ఛెళ్లుమనిపించింది. అంతటితో ఆగని ఆ యువతి వారిని కదలకుండా పట్టేసి, పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు సదరు ఆకతాయిలను పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News