: అంగ్ సాన్ సూకీతో ఒబామా భేటీ!


మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత అంగ్ సాన్ సూకీతో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం భేటీ అయ్యారు. దక్షిణాసియా దేశాల సదస్సులో పాల్గొనే నిమిత్తం ఒబామా గురువారం మయన్మార్ వచ్చారు. యాంగూన్ లో శుక్రవారం వీరిద్దరి మధ్య జరిగిన ఈ భేటీ వివరాలు తెలియరాలేదు. దక్షిణాసియా దేశాల సదస్సు కోసం వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆంగ్ సాన్ సూకీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. మయన్మార్ లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న సూకీని ఆ దేశ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది.

  • Loading...

More Telugu News