: మన నౌకాదళానికి మైన్ స్వీపర్లు కావాలి: నేవీ చీఫ్


భారత నావికా దళంలో అత్యవసరంగా మైన్ స్వీపర్ నౌకలు కావాలని నేవీ చీఫ్ ధోవన్ కోరారు. దక్షిణ కొరియా నుంచి ఎనిమిది నౌకలు సరఫరా కావాల్సి ఉండగా, సంబంధిత కంపెనీ ఇంకా నౌకలను భారత్ కు అప్పగించలేదు. హిందూ మహా సముద్రంలోని భారత జలాల్లో ఇతర నౌకల ప్రవేశాన్ని, విద్రోహుల కుట్రలను భగ్నం చేయడంలో మైన్ స్వీపర్లు కీలక పాత్ర పోషిస్తాయి. సముద్రంలో భారత గస్తీ, యుద్ధ నౌకలను లక్ష్యం చేసుకుని శత్రుదేశాలు, విద్రోహులు పెట్టిన మందుపాతరలను గుర్తించి మైన్ స్వీపర్లు వెలికి తీయగలవు. ఆధునిక యుద్ధ క్షేత్రాల్లో మైన్ స్వీపర్లు కీలక పాత్ర పోషిస్తాయి.

  • Loading...

More Telugu News