: జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ కోరితే మరిన్ని బలగాలు పంపుతాం: రాజ్ నాథ్ సింగ్


జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు, ఆయా రాష్ట్రాలు కోరితే మరిన్ని పారామిలటరీ బలగాలు పంపుతామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. కాగా, జమ్మూ కాశ్మీర్ లో 60 వేల మంది సీఆర్ఫీఎఫ్ సిబ్బంది ఎన్నికల్లో పాలుపంచుకుంటుండగా, మరో 381 బీఎస్ఎఫ్, ఐటీబీపీ కంపెనీలను కేంద్రం పంపించింది. రాష్ట్రం కోరితే మరిన్ని బలగాలు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్నికలు శాంతియుత వాతావరణంలో, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు శాంతియుతంగా జరుగుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News