: గర్భిణి మృతి...అసెంబ్లీ ఎదుట బంధువుల ఆందోళన
హైదరాబాదులోని జజ్జిఖానా ఆసుపత్రిలో మహబూబ్ నగర్ జిల్లా నవర గ్రామానికి చెందిన యాదమ్మ అనే గర్భిణి చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే యాదమ్మ మృతి చెందిందని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు నినాదాలు చేస్తున్నారు. కాగా, శాసనసభలో బడ్జెట్ పై చర్చ కొనసాగుతోంది.