: చిరంజీవి ఇంటిని ఖాళీ చేయాలంటూ నోటీసులంటించిన అధికారులు
కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ఇంటిని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు అంటించారు. యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా ప్రభుత్వ సౌకర్యాలను అనుభవించిన చిరంజీవి, యూపీఏ గద్దెదిగినప్పటికీ ఇంటిని ఖాళీచేయలేదు. 2014 మే 30తోనే ఆయన అధికారిక నివాసం గడువు ముగిసింది. దీంతో ఇల్లు ఖాళీ చేయాలంటూ ఆయనకు జూన్ నెలలో అధికారులు నోటీసులిచ్చారు. వాటిని ఆయన బేఖాతరు చేయడంతో, ఢిల్లీలోని ఆయన నివాసానికి నోటీసులు అంటించి వెళ్లారు.