: మహీంద్రా నుంచి మరో మూడు కొత్త వాహనాలు
దేశవాళి వాహన మార్కెట్లో మరింత వాటా లక్ష్యంగా 2015 లో మూడు సరికొత్త వాహనాలను విడుదల చేయాలని మహీంద్రా అండ్ మహీంద్రా నిర్ణయించింది. వీటిల్లో రెండు ఎస్.యు.వి లు ఉంటాయని సంస్థ ఎగ్జిక్యూటివ్ పవన్ గోయెంకా తెలిపారు. కొరియన్ సంస్థ సాంగ్ యోంగ్ తో కలసి కొత్త ఇంజన్లను తయారు చేస్తున్నట్టు ఆయన వివరించారు. చక్కన్ లో తాము నిర్వహిస్తున్న ప్లాంట్ లో 4 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో, తయారీ సామర్థ్యాన్ని 7.5 లక్షల యూనిట్లకు పెంచనున్నట్టు ఆయన తెలిపారు.