: తప్పులు మాట్లాడడం సహజమే: కేసీఆర్


వాడీవేడి చర్చ జరిగేటప్పుడు మాటలు దొర్లడం సహజమేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. విరామం అనంతరం శాసనసభ ప్రారంభమైన తర్వాత ఆయన మాట్లాడుతూ, గతంలో ఇందిరాగాంధీ అంతటి వారే తప్పులు మాట్లాడి క్షమాపణలు చెప్పిన సంఘటనలు ఉన్నాయని అన్నారు. విద్యుత్ అంశంపై మాట్లాడుతూ సభను తప్పుదోవ పట్టించిన రేవంత్ రెడ్డి నూటికి నూరు శాతం క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో శాసనసభలో అధికారపక్షం, టీడీపీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం సభలో గందరగోళం నెలకొంది.

  • Loading...

More Telugu News