: కాంబ్లీ జీవన విధానం వేరు, నాది వేరు: సచిన్
తన చిన్ననాటి మిత్రుడు వినోద్ కాంబ్లీ గురించి ఎట్టకేలకు సచిన్ నోరువిప్పాడు. "కాంబ్లీ టాలెంట్ గురించి నేను ఏమీ మాట్లాడను. కానీ, జీవన విధానం విషయానికొస్తే కాంబ్లీది ఒక శైలి, నాది మరోశైలి" అని చెప్పాడు. ఎన్నో విషయాల్లో తాను, కాంబ్లీ భిన్నంగా స్పందించామని తెలిపాడు. తన తల్లిదండ్రులు ప్రతి దశలో తనపై కన్నేసి ఉంచారని... ఈ విషయంలో కాంబ్లీ గురించి తానేమీ మాట్లాడలేనని చెప్పాడు. ఒక రకంగా కాంబ్లీ తప్పుదోవ పట్టకుండా నిరోధించడంలో అతని తల్లిదండ్రులు విఫలమయ్యారనే విధంగా సచిన్ మాట్లాడాడు. రెండు వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కాంబ్లీ... కేవలం 17 టెస్టులు మాత్రమే ఆడటం కలచివేసే అంశం. 23 ఏళ్ల వయసులో కాంబ్లీ తన చివరి టెస్టు ఆడాడు.