: ఎన్టీఆర్ ఆశయాలను గౌరవించండి: టీడీపీ నేతలకు విశ్రాంత ఐఏఎస్ అధికారి చురక


తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిపై గొప్పగా మాటలు చెప్పడమే కాదని, ఆయన ఆశయాలను కూడా గౌరవించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు టీడీపీ నేతలకు, ప్రభుత్వానికి చురకలంటించారు. మద్యం వ్యాపారాన్ని ఆదాయ వనరుగా మార్చుకుని నడిచే పాలన రాజ్యాంగ వ్యతిరేకమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మ అన్నారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు మద్యం తయారీ కంపెనీలకు అనుమతిస్తూ ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబుకే నేరుగా లేఖ రాశానని ఆయన చెప్పారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాలపై వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ సర్కారు వైఖరిని ఆయన తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News