: నేటి నుంచే నెహ్రూ జయంతి కార్యక్రమాలు


భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 125వ జయంతిని పురస్కరించుకుని నేటి నుంచి స్మారక కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రారంభించనుంది. ఈ మేరకు ఢిల్లీలోని తల్కాటొర స్టేడియంలో నిర్వహించనున్న కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరవుతారు. నెహ్రూ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటారని ట్విట్టర్ లో తెలిపారు. ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఉదయం పదకొండు గంటల నుంచే మొదలవుతుంది.

  • Loading...

More Telugu News