: జయపై అనర్హత వేటు వేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ


18 ఏళ్ల నాటి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. దీంతో చట్ట ప్రకారం ఆమెపై అనర్హత వేటు పడింది. జయను పదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తూ తమిళనాడు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్టు తీర్పు వెలువరించిన సెప్టెంబర్ 27 నుంచి అనర్హత వేటు అమల్లోకి వచ్చినట్టు గెజిట్ లో పేర్కొంది. ఈ గెజిట్ నోటిఫికేషన్ ను తమిళనాడు స్పీకర్ పి.ధనపాల్ విడుదల చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8 ప్రకారం జయపై అనర్హత వేటు పడినట్టు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News