: శేషాచలం అడవుల్లో తప్పిపోయిన ప్రొఫెసర్, విద్యార్థులు క్షేమం
శేషాచలం అడవుల్లో తప్పిపోయిన యోగి వేమన వర్సిటీ ప్రొఫెసర్, మరో ఏడుగురు విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు. బుధవారం సాయంత్రం కడప నుంచి తిరుమలకు కాలి నడకన శేషాచలం అడవుల మీదుగా బయలుదేరిన వీరంతా బుధవారం రాత్రి ఆచూకీ లేకుండా పోయారు. దీంతో వీరి జాడ కోసం పోలీసులు సహా అటవీ శాఖ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత అటవీ శాఖ సిబ్బంది వీరిని రేణిగుంట పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. నేడు వీరిని వారివారి స్వస్థలాలకు పంపిస్తారు.