: మళ్లీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియాదే టాప్!
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత క్రికెట్ జట్టు తిరిగి అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. శ్రీలంకతో జరుగుతున్న 5 వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే వరుసగా మూడు వన్డేలు గెలిచిన టీమిండియా సిరీస్ ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో 116 పాయింట్లతో టీమిండియా వన్డే ర్యాంకింగ్స్ లో తొలి స్థానానికి ఎగబాకింది. 115 పాయింట్లతో దక్షిణాఫ్రికా, 114 పాయింట్లతో ఆస్ట్రేలియా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. లంకతో మిగిలిన రెండు మ్యాచ్ లను టీమిండియా గెలిస్తే ఈ ర్యాంకింగ్స్ లో మరింత పటిష్ఠ స్థితికి చేరుకుంటుంది. ఒకవేళ రెండు వన్డేలను కోల్పోయినా కూడా టీమిండియాకు ఇప్పటికిప్పుడు వచ్చే ప్రమాదమేమీ లేకపోయినా, నేటి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య ప్రారంభం కానున్న సిరీస్ నేపథ్యంలో మిగిలిన రెండు వన్డేలను గెలిస్తేనే భారత్ ర్యాంక్ పదిలమని క్రికెట్ పండితులు చెబుతున్నారు.