: ఈడెన్ లో నేడు నాలుగో వన్డే!
శ్రీలంకతో టీమిండియా నాలుగో వన్డే నేడు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. 5 వన్డేల సిరీస్ లో ఇప్పటికే 3-0తో టైటిల్ ను చేజిక్కించుకున్న టీమిండియా సిరీస్ క్లీన్ స్వీప్ పై కన్నేసింది. ప్రపంచ కప్ కు సమయం ఆసన్నమవుతున్న నేపథ్యంలో ప్రయోగాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా పరిపూర్ణ జట్టుగానే బరిలోకి దిగనుంది. అయితే, ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ బరిలోకి దిగుతున్నాడు. చివరి రెండు వన్డేలకు ఈ ఒక్క మార్పు మినహా పెద్ద మార్పులేమీ లేకుండానే కోహ్లీ సేన బరిలోకి దిగుతోంది.