: విశ్వనాథుడి నాలుగో గేమ్ డ్రా!
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో భాగంగా భారత చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్, కార్ల్ సన్ లు తలపడిన నాలుగో గేమ్ డ్రాగా ముగిసింది. వీరి మధ్య జరిగిన మూడో గేమ్ లో ఆనంద్ విజయం సాధించాడు. రష్యాలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా బుధవారం దాదాపు 5 గంటల పాటు సాగిన నాలుగో మ్యాచ్ లో ఇరువురు డ్రా వైపే మొగ్గు చూపారు. దీంతో 12 మ్యాచ్ ల టైటిల్ పోరులో 2-2 స్కోరుతో ఇరువురూ సమఉజ్జీలుగా నిలిచారు.