: ఉప్పల్ నాలాలో కొట్టుకుపోయిన యువతి... మృతదేహం లభ్యం
సికింద్రాబాద్ లోని ఉప్పల్ బస్టాప్ వద్ద ఉన్న నాలాలో ఓ యువతి కొట్టుకుపోయింది. రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన యువతిని శామీర్ పేటకు చెందిన సత్యవాణి (26)గా గుర్తించారు. ఈ సాయంత్రం జంటనగరాల్లో కురిసిన భారీ వర్షానికి నాలాలు పొంగి ప్రవహించాయి.