: చంద్రబాబు పేరును 'సింగపూర్ నాయుడు'గా మార్చుకుంటే మంచిది: అంబటి
ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనపై వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపణలు చేశారు. సొంత పనుల కోసమే బాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారన్నారు. అక్కడ ఆయనకు చెందిన వ్యాపారాలు, హోటళ్లు ఉన్నాయని తెహల్కా పత్రిక వెల్లడించిందన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. బాబు పేరును ఇకనుంచి సింగపూర్ నాయుడుగా మార్చుకుంటే బాగుంటుందని సూచించారు. అసలు సింగపూర్ పర్యటనకు ఇన్ని ఆర్భాటాలు చేయడం అవసరమా? అని ప్రశ్నించారు. రాజధాని కోసం ప్రజలను చందాలడుగుతూ, ఇటు రెండు ప్రత్యేక విమానాల్లో తన బృందంతో సింగపూర్ కు వెళ్లాల్సిన అవసరం ఏంటని సూటిగా అడిగారు.