: ‘మహా’ స్పీకర్ గా బాగ్డే ఏకగ్రీవ ఎన్నిక
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా బీజేపీకి చెందిన హరిభావ్ బాగ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి బరిలో దింపిన అభ్యర్థులను శివసేన, కాంగ్రెస్ పార్టీలు ఉపసంహరించుకోవడంతో బాగ్డే ఏకగ్రీవ ఎంపికకు మార్గం సుగమమైంది. శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే బీజేపీ అభ్యర్థి బాగ్డేకి మద్దతు ప్రకటించారు. కొద్దిసేపటి క్రితమే స్పీకర్ గా బాగ్డే ఎన్నికపై అధికారికంగా ప్రకటన విడుదలైంది.