: ‘ఆంధ్రా పిలుస్తోంది’... పెట్టుబడుల కోసం చంద్రబాబు డాక్యుమెంటరీ!
రాష్ట్రానికి భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులను రాబట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సింగపూర్ లో అడుగుపెట్టారు. నేడు దక్షిణాసియా సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. ఆయన ప్రసంగం సమయంలో ఓ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారు. ‘ఆంధ్రా పిలుస్తోంది’ పేరిట ప్రత్యేకంగా రూపొందిన ఈ డాక్యుమెంటరీని ఈ సదస్సులోనే కాక, సింగపూర్ పర్యటన ఆసాంతం ప్రదర్శించనున్నారు. కేవలం పెట్టుబడులను ఆకర్షించడం కోసమే రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో, పెట్టుబడుల కోసం ఏపీకి వచ్చే పారిశ్రామిక వేత్తలకు అందుబాటులో ఉన్న అవకాశాలు, ప్రభుత్వం నుంచి లభించే సహకారం, అందివచ్చే రాయితీలు తదితర వివరాలన్నీ ఆకట్టుకునే రీతిలో పొందుపరచినట్లు తెలుస్తోంది.