: మారిషస్ బ్యాంకుకు సుజనా చౌదరి రూ.106 కోట్ల బకాయి... హైకోర్టులో పిటిషన్!
తమ వద్ద తీసుకున్న రుణం చెల్లించడం లేదన్న ఆరోపణలపై కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలైంది. మారిషస్ కమర్షియల్ బ్యాంక్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. తమకు సుజనా చౌదరి రూ.106 కోట్ల మేర బకాయి ఉన్నారని, బకాయి చెల్లింపుల కోసం తాము చేసిన వినతులను సుజనా కంపెనీ, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పట్టించుకోవడం లేదని ఆ బ్యాంకు తన పిటిషన్ లో వాపోయింది. బకాయి చెల్లింపులపై స్పందించని సుజనా కంపెనీ ఆస్తులను అమ్మేసి తమ బకాయిలు చెల్లించేలా లిక్విడేటర్ ను నియమించాలని హైకోర్టును మారిషస్ బ్యాంకు ఆ పిటిషన్ లో కోరింది.