: న్యూయార్క్ మహిళ తరహాలో ముంబయి వీధుల్లో యువతి ఒంటరి నడక!


షార్ట్ ఫిలిం కోసం న్యూయార్క్ వీధుల్లో ఓ మహిళ ఒంటరిగా నడవగా, ఆమెపై వందకుపైగా కామెంట్లు విసిరారు పోకిరీలు. ఇప్పుడదే తరహాలో ముంబయిలోనూ ఓ మహిళ 10 గంటల పాటు ఒక్కతే నడిచింది. దాదర్ ఈస్ట్ నుంచి అంధేరి, బాంద్రా నుంచి కుర్లా వరకు అన్ని ప్రాంతాలను చుట్టేసింది. ఆశ్చర్యకరంగా ఒక్కరంటే ఒక్కరూ ఆమెపై వ్యాఖ్యలు చేయలేదట. స్లీవ్ లెస్ టాప్, మోకాళ్లపైకి స్కర్ట్ తో ఆమె కాస్తంత రెచ్చగొట్టే విధంగానే ఉన్నా, ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదట. తద్వారా, ముంబయి నగరం మహిళలకు ఎంత సురక్షితమైనదో స్పష్టమయిందనుకోవచ్చు. ఇప్పుడీ వీడియో యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News