: హవాలా డబ్బు స్వాధీనం చేసుకున్న ఈడీ
అక్రమంగా డబ్బులు చేతులు మారుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడిలో 62.50 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. తమిళనాడులోని తీర పట్టణం కన్యాకుమారి సమీపంలోని ఓ ఇంట్లో హవాలా రాకెట్ ను నిర్వహిస్తున్న అబ్రహం జయ కుమార్ తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ఈడీ జాయింట్ డైరెక్టర్ (చెన్నై విభాగం) కె.ఎస్వి.ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించిన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామని, ఈ డబ్బు సౌదీ అరేబియా నుంచి వచ్చినట్టు గుర్తించామని వివరించారు. ఫెమా చట్టం కింద విచారణ చేపట్టామని తెలిపారు.