: కోహ్లీకే టెస్ట్ కెప్టెన్సీ అవకాశం
త్వరలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ మ్యాచ్ సిరిస్ లో తొలి మ్యాచ్ కి కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించే అవకాశం విరాట్ కోహ్లికి దక్కింది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్ డే సిరీస్ కు గాయం కారణంగా దూరమైన ధోని, ఆపై ఆస్ట్రేలియాతో జరిగే తొలి టెస్ట్ కు సైతం గైర్హాజరు కానున్నాడు. ఈ నేపథ్యంలో, తొలి టెస్ట్ కు కోహ్లి కెప్టెన్ గా విధులు నిర్వహిస్తాడని బీసీసీఐ స్పష్టం చేసింది. తొలి టెస్ట్ డిసెంబర్ 4 నుంచి బ్రిస్బేన్ లో జరగనుంది. లంకతో సిరీస్ అనంతరం నవంబర్ 21న భారత జట్టు ఆస్ట్రేలియాకు బయల్దేరనుంది. వన్ డే పోటీలలో కెప్టెన్ గా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న కోహ్లీ టెస్టుల విషయంలో ఎలా అడుగులేస్తాడో వేచి చూడాల్సిందే.