: వచ్చే నాలుగేళ్లలో సగానికి సగం పడిపోనున్న ఐటీ నూతన నియామకాలు:'క్రిసిల్'
రానున్న నాలుగు సంవత్సరాల్లో సమాచార సాంకేతిక రంగంలో (ఐటీ) నూతన నియామకాల్లో 50 శాతం తరుగుదల కనిపించవచ్చని ప్రముఖ విశ్లేషణ సంస్థ 'క్రిసిల్' అంచనా వేస్తోంది. అదే సమయంలో, ఐటీ పరిశ్రమ రాబడిలో 13 నుంచి 15 శాతం వృద్ధి ఉంటుందని, అయినా నియామకాల్లో తరుగుదల తప్పదని చెబుతోంది. ఈ మేరకు క్రిసిల్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. కాగా, ఈ అంచనా దేశంలోని లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రతికూలం కానుంది. ప్రస్తుతం భారత్ లో ప్రైవేటు సెక్టార్ లోని ఐటీ రంగమే అత్యధికంగా ఉద్యోగాలు కల్పిస్తోంది. ఈ రంగంలో లాభాలను పెంచుకునే దిశగా పలు కంపెనీలు ఉద్యోగ నియామకాలను సగానికి సగం తగ్గించుకుంటున్నాయి. దానివల్ల భవిష్యత్ లో ఐటీ ఇంజనీరింగ్ చేసిన యువకులకు పరిమితంగా అవకాశాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.