: లిక్కర్ షాపులను రహదారులపై నుంచి తొలగించండి: కేరళ హైకోర్టు ఆదేశం


జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న అన్ని రిటైల్ మద్యం దుకాణాలను తరలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేరళ హైకోర్టు ఆదేశించింది. రెండు వారాల్లోగా సమగ్ర నివేదికను తమకు సమర్పించాలని చెప్పింది. ఈ మేరకు దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఆధారంగా చీఫ్ జస్టిస్ అశోక్ భూషణ్ ఓ ఆదేశాన్ని జారీ చేశారు. అలాంటి దుకాణాలు రహదారుల పక్కనే ఉండటం వలన వాహన డ్రైవర్లు సులువుగా లిక్కర్ కొని తాగుతున్నారని... దాంతో, ప్రమాదాలు జరుగుతున్నాయని పిల్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం కేరళ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కు చెందిన 169 లిక్కర్ షాపులు రహదారుల పక్కనే ఉన్నాయని వివరించారు.

  • Loading...

More Telugu News