: రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సురేశ్ ప్రభు
కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా సురేశ్ ప్రభు బాధ్యతలు చేపట్టారు. సదానందగౌడ నుంచి ఈ శాఖ బాధ్యతలను ఆయన స్వీకరించారు. ఇక నుంచి న్యాయశాఖ బాధ్యతలను సదానంద చూడనున్నారు. తొలిసారి చేపట్టిన కేబినెట్ విస్తరణలో పదవి దక్కించుకున్న సురేశ్, నిన్న (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేసిన గంట వ్యవధిలోనే శివసేన నుంచి బీజేపీలో చేరారు.