: కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ బాధ్యతలు చేపట్టారు. మంత్రి ప్రకాశ్ జవదేకర్ నుంచి ఆ శాఖ బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటికే ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల శాఖలను చూస్తున్న జైట్లీకి ఇది మూడో అదనపు బాధ్యత. అటు సమాచార శాఖ సహాయమంత్రిగా రాజ్యవర్దన్ సింగ్ బాధ్యతలు చేపట్టారు. కాగా, ఇప్పటికే పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు శాఖ బాధ్యతలు చూస్తున్న జవదేకర్ అందులోనే కొనసాగనున్నారు.