: తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ: కేంద్ర మంత్రి దత్తాత్రేయ
తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగనుందని, ఆ దిశగా తాము పకడ్బందీగా ముందుకు సాగనున్నట్లు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత విలేకరులతో మాట్లాడిన ఆయన తెలంగాణలో పార్టీని గ్రామస్థాయిలో విస్తరిస్తామన్నారు. అంతేకాక రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అన్ని రకాల నిధులు విడుదల చేయించేందుకు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం పక్కాగా అమలయ్యేలా చేస్తానని కూడా ఆయన ప్రకటించారు.