: ప్రపంచ చాంపియన్ షిప్ చెస్ తొలి గేమును డ్రా చేసుకున్న ఆనంద్
రష్యాలోని సోచి నగరంలో జరుగుతున్న వరల్డ్ చెస్ చాంపియన్ షిప్ లో భారత టాప్ చదరంగ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ తొలి గేమును డ్రా చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ తో జరుగుతున్న ఈ టైటిల్ సమరంలో ఆనంద్ క్వీన్స్ పాన్ వేరియేషన్ తో గేమ్ మొదలుపెట్టాడు. అయితే, ప్రపంచ విజేత కార్ల్ సన్ గ్రన్ ఫెల్డ్ డిఫెన్స్ తో సమర్థంగా ఎదుర్కొన్నాడు. చివర్లో ఆనంద్ చేసిన పొరబాట్లను తనకు అనుకూలంగా మలుచుకున్న కార్ల్ సన్ దూకుడు పెంచాడు. దీంతో, ఆనంద్ కు రక్షణాత్మక ఆటతీరుకు ప్రాధాన్యమిచ్చాడు. చివరికి 48 ఎత్తుల వద్ద గేము డ్రాగా ముగిసింది.