: అరుణ్ జైట్లీతో భేటీ అయిన జగన్
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో వైకాపా అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, హుదూద్ తుపాను పునరావాస కార్యక్రమాల కోసం ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 1000 కోట్ల సాయాన్ని వెంటనే విడుదల చేయాలని జైట్లీకి జగన్ విన్నవించారు. జగన్ వెంట మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బుట్టా రేణుక, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్ తదితర నేతలు కూడా ఉన్నారు.