: గోవా సీఎంగా పర్సేకర్ ప్రమాణస్వీకారం
గోవా నూతన ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో ఆ రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా నాలుగు గంటలకు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, హాజరయ్యారు. అంతకుముందు పర్సేకర్ మాట్లాడుతూ, సీఎంగా ఎన్నికైనందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా మనోహర్ పారికర్ కు ధన్యవాదాలు తెలిపారు.