: రాయుడు... టీమిండియా ఆశాకిరణం: కోహ్లీ
శ్రీలంకతో రెండో వన్డేలో జూలు విదిల్చి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించిన అంబటి రాయుడిపై భారత స్టార్ క్రికెటర్, తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాకు రాయుడు భవిష్యత్తు ఆశా కిరణమని కోహ్లీ పేర్కొన్నాడు. లంకపై అజేయ సెంచరీతో ఆకట్టుకున్న రాయుడిని మూడో స్థానంలో దింపేందుకు యోచిస్తున్నామని తెలిపాడు. బ్యాటింగ్ లో స్థిరమైన ప్రదర్శనతో కొనసాగుతున్న రాయుడు రానున్న రోజుల్లో మరింత పరిణతి సాధిస్తాడని చెప్పాడు.