: నారాయణ విద్యా సంస్థలపై కర్ణాటకలో చీటింగ్ కేసు నమోదు


అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో శాఖలను ఏర్పాటు చేసిన ప్రముఖ విద్యా సంస్థ నారాయణ టెక్నో స్కూల్స్ పై కర్ణాటకలో చీటింగ్ కేసు నమోదైంది. ఏపీ మంత్రి నారాయణ నేతృత్వంలో చాలా కాలం కిందట రాష్ట్రంలో మొగ్గతొడిగిన నారాయణ విద్యా సంస్థలు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించాయి. అయితే కర్ణాటకలో అనుమతి లేకుండానే నారాయణ టెక్నో స్కూల్స్ పేరిట మొత్తం 16 విద్యాలయాలు ఏర్పాటయ్యాయని కర్ణాటక విద్యాశాఖ వర్గాల ఆరోపణ. ఈ నేపథ్యంలో విద్యాశాఖాధికారి ఫిర్యాదుతో అడుగొడి పోలీస్ స్టేషన్ లో నారాయణ విద్యా సంస్థ, దాని యాజమాన్యంపై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో ఏపీ మంత్రి నారాయణతో పాటు విద్యా సంస్థల ప్రిన్సిపల్ రమాదేవి సహా ఏడుగురిపై చీటింగ్ అభియోగాలు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News