: తెలంగాణ అభివృద్ధికి ప్రాధాన్యం: బండారు దత్తాత్రేయ
కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్న బీజేపీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, తన ప్రథమ ప్రాధాన్యం మాత్రం తెలంగాణ అభివృద్ధికేనని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా దేశమంతా పర్యటించాల్సి ఉన్నా, తెలంగాణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తానని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ మార్గంలో స్వచ్ఛమైన పాలన అందించడమే తన బాధ్యత అని దత్తాత్రేయ అన్నారు.