: ఇక ప్రతి శనివారం రాజ్ భవన్ లో స్వచ్ఛ భారత్ : గవర్నర్
నరేంద్ర మోదీ సర్కారు ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్ పై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మరింత ఆసక్తి కనబరుస్తున్నారు. క్రమం తప్పకుండా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆయన కార్యరంగంలోకి దిగారు. గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ లో ప్రతి శనివారం స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తన సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమాల్లో తాను కూడా పాల్గొంటానని చెప్పిన నరసింహన్, ఏదేనీ సర్కారీ దవాఖానాలో స్వచ్చ భారత్ చేపడితే, తాను స్వయంగా పాలుపంచుకుంటానని ప్రకటించారు.