: నవ్యాంధ్ర రాజధాని భూసేకరణపై నేడు కీలక భేటీ!


నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణకు సంబంధించి కీలక భేటీ నేడు జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో రాజధాని భూసేకరణ కమిటీ సభ్యులు యనమల రామకృష్ణుడు, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, తదితరులు హాజరుకానున్నారు. భూసేకరణలో ఎప్పటికప్పుడు తెరపైకి వస్తున్న వివాదాల పరిష్కారం, రైతులను ఒప్పించేందుకు అవలంబించాల్సిన వ్యూహం, భూసేకరణ జరగాల్సిన తీరుతెన్నులు, ఏ మేరకు భూమిని సేకరించాలి అన్న అంశాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. భేటీ అనంతరం సీఎం చంద్రబాబే నేరుగా మీడియాకు వివరాలు వెల్లడించనున్నారన్న ప్రచారం నేపథ్యంలో కీలక నిర్ణయాలుండే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News